యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ యావత్ దేశానికే తలమానికం: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులు యావత్‌ దేశానికే తలమానికంగా నిలుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం అన్నారు.

రైతులు, తెలంగాణ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులను కార్పొరేట్‌ వ్యక్తుల ఒత్తిళ్లకు లొంగకుండా ప్రభుత్వ రంగంలోనే చేపడుతున్నామన్నారు.

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు.