‘వాల్తేరు వీరయ్య’ క్రేజీ అప్డేట్ ఇచ్చేసిన దేవిశ్రీ

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri movoe makers) బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్ర‌మిది. ఈ సినిమా రానున్న సంక్రాంతికి (Sankranthi 2023) విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుంది. ఓ వైపు ఫైన‌ల్ లెగ్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ.. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను కూడా కంప్లీట్ చేసుకుంటోంది. మెగా ఫ్యాన్స్ సినిమా అప్‌డేట్స్ గురించి ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ త‌రుణంలో సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ (Devi sri Prasad) ఓ క్రేజీ విష‌యాన్ని చెప్పి మెగా ఫ్యాన్స్‌ని సంతోషంలో ముంచెత్తారు. ఇంత‌కీ మ‌న రాక్‌స్టార్ ఏం చెప్పారో తెలుసా!. ఈ వారం ‘వాల్తేరు వీరయ్య’ నుంచి తొలి పాట రానుందని.

‘‘ఇప్పుడే పాట‌ను చూశాను. మెగాస్టార్ (Megastar) ఎన‌ర్జీకి దిమ్మ తిరిగిపోయింది. అందుక‌నే ముందుగానే విష‌యాన్ని లీక్ చేసేస్తున్నాను. వ‌చ్చే వార‌మే తొలి పాట రానుంది. పార్టీ కోసం రెడీగా ఉండండి. ఎందుకంటే అది బాస్ పార్టీ (Boss Party)’’ అని అన్నారు దేవిశ్రీ ప్రసాద్. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో యూనిట్ ప్రమోషన్స్ విషయంలోనూ ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తుంది. అందులో భాగంగా తొలి పాటను రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో భారీ సెట్ వేసి అందులో స్పెష‌ల్ సాంగ్‌ను చిత్రీక‌రించారు. అందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతేలా (Urvashi Rautela) న‌ర్తించిన సంగ‌తి తెలిసిందే. ఆ పాట‌నే తొలి పాట‌గా రిలీజ్ చేయ‌బోతున్నారని తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ఇద్ద‌రు అన్న‌దమ్ములుగా క‌నిపించ‌నున్నారు. ఇద్ద‌రు మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు న‌టిస్తోన్న సినిమా కావ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే ఫ్యాన్సీ రేటుకు థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్ముడైన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. శ్రుతీ హాస‌న్ (Shruti Haasan) హీరోయిన్‌గా న‌టించింది.