వివో వీ25 5జీ.. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్‌.. రూ.2,500 డిస్కౌంట్‌తో

వివో వీ25 5జీ తొలిసారి ఓపెన్ సేల్‌కు వచ్చింది. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, AMOLED డిస్‌ప్లే హైలైట్‌గా ఉండగా.. సర్ఫింగ్ బ్లూకలర్ వేరియంట్ రంగులు మారే బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఫస్ట్ సేల్‌ సందర్భంగా రూ.2,500 డిస్కౌంట్ పొందేలా కార్డ్ ఆఫర్లు ఉన్నాయి.

Vivo V25 5G First sale, price, offers : వివో వీ25 5జీ స్మార్ట్‌ఫోన్ తొలి ఓపెన్ సేల్‌ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) తో పాటు వివో ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్‌ సేల్‌కు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా సెల్ఫీలకు ప్రాధాన్యమిచ్చే వారి కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‌ కలిగి ఉంది. Full HD+ AMOLED డిస్‌ప్లే, OIS సపోర్ట్ ఉన్న వెనుక 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. తొలి సేల్‌ సందర్భంగా Vivo V25 5Gని రూ.2,000 తగ్గింపుతో కొనేలా బ్యాంక్ కార్డ్ ఆఫర్లు ఉన్నాయి.

Vivo V25 5G ధర, సేల్‌
8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న వివో వీ25 5జీ బేస్ మోడల్ ధర రూ.27,999, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ టాప్‌ వేరియంట్ ధర రూ.31,999గా ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌ సేల్‌కు వచ్చింది. సర్ఫింగ్ బ్లూ, ఎలిగంట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో Vivo V25 5G లభిస్తోంది. కలర్ చేంజింగ్ ప్యానెల్ సర్ఫింగ్ బ్లూ కలర్ ఆప్షన్‌కు ఉంటుంది.

అమెజాన్‌లో బెస్ట్ సెల్లింగ్ లాప్‌టాప్స్‌పై 40% వరకు తగ్గింపు

Vivo V25 5G ఆఫర్
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో కొంటే వివో వీ25 5జీ మొబైల్‌పై రూ.2,500 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

Vivo V25 5G స్పెసిఫికేషన్లు

90Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లేతో వివో వీ25 5జీ వస్తోంది.
మీడియాటెక్ డైమన్సిటీ 900 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత FunTouch OS 12తో వస్తోంది.
Vivo V25 5G వెనుక వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. ఐ ఆటోఫోకస్ ఫీచర్ కూడా ఉంటుంది.
4,500mAh బ్యాటరీతో Vivo V25 5G వస్తోంది. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే, డ్యుయల్ సిమ్, 5G, 4G LTE, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, GPS, USB టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. మొత్తంగా Vivo V25 5G ఫోన్ 186 గ్రాముల బరువు ఉంటుంది.