శృంగారం చేసిన క్రేజీ ప్లేస్ ఏదంటూ కరణ్ అడిగితే.. విజయ్ నుంచి ఊహించని సమాధా

ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లో స్టార్‌‌గా ఎదిగిన నటుడు విజయ్ దేవరకొండ. ‘లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు.. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా మారాడు. అనంతరం చేసిన ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టి క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ రౌడీ హీరో ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌ని జోరుగా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ తరుణంలోనే పాపులర్ టాక్ ‘కాపీ విత్ కరణ్‌’కి అనన్యపాండేతో కలిసి విజయ్ అతిథిగా వెళ్లాడు.

బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తాజాగా ఎపీసోడ్ ప్రోమోని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విడుదల చేసింది. షోకి అతిథులుగా వచ్చిన సెలబ్రిటీలను కరణ్ క్రేజీ ప్రశ్నలు అడుగుతుంటాడు. ఎప్పటిలాగే విజయ్‌ని, అనన్యని సైతం అలాంటి ప్రశ్నలే అడిగాడు కరణ్. అనన్య, ఆదిత్యారాయ్ కపూర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీని గురించి కరణ్ మాట్లాడుతూ.. నీకు, ఆదిత్యారాయ్‌కి మధ్యలో ఏం జరుగుతోందని ప్రశ్నించాడు. అయితే.. సమాధానం చెప్పడానికి అనన్య సందేహించడం ప్రోమోలో కనిపిస్తుంది.

అలాగే విజయ్‌తో మాట్లాడుతూ.. ‘నువ్వు శృంగారం చేసిన క్రేజీ ప్లేస్ ఏది?’ అని కరణ్ అడిగాడు. దానికి విజయ్ సందేహిస్తూనే ‘కారులో’ అని చెప్పాడు. దానికి కారులో అంత కంఫర్ట్‌గా ఉండదేమో అని కరణ్ సందేహంగా అడిగాడు. దానికి.. ‘పరిస్థితి అలాంటిది’ అని సిగ్గు పడుతూనే విజయ్ తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.