ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వరుణ్ తేజ్ పాన్ ఇండియా చిత్రం.!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ లైనప్ తో వస్తున్నా సంగతి తెలిసిందే. ఇక ఈ లైనప్ లో అయితే గత కోన్ని రోజులు నుంచి ఆసక్తిగా వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ కాంబో దర్శకుడు కరుణ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా కూడా ఒకటి. ఇక ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ ఈరోజు సాలిడ్ అప్డేట్ ని అందించారు. ఈ చిత్రానికి మేకర్స్ ఇంట్రెస్టింగ్ టైటిల్ “మట్కా” అనే దానిని ఫిక్స్ చేసి ఓ కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.


దీనితో ఈ చిత్రం కంప్లీట్ గా డబ్బులు బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది. అలాగే ఈ చిత్రంలో ఇది వరకే వచ్చిన టాక్ తో బాలీవుడ్ స్టార్ బ్యూటీ నోరా ఫతేహి కూడా కన్ఫర్మ్ అయ్యిపోయింది. అలాగే ఈ చిత్రంని అయితే మేకర్స్ పాన్ ఇండియా చిత్రంగా అనౌన్స్ చేయడం విశేషం కాగా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.