‘చరణ్’ సినిమాలో కన్నడ స్టార్ హీరో ?

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో మరో సీనియర్ హీరో కూడా నటిస్తున్నాడా ? అంటే.. అవుననే టాక్ నడుస్తోంది. ఈ సినిమా పీరియాడిక్ పొలిటికల్ డ్రామా. ఐతే ఈ సినిమాలో ఓ విప్లవ నాయకుడి పాత్ర ఉందని, ఈ పాత్ర చరణ్ పాత్రకు గురువు పాత్ర అని.. పోరాటం ద్వారానే దేశంలో అవినీతిని తరిమి కొట్టవచ్చు అని నమ్మి, అది ఆచరణలో పెట్టే నాయకుడు పాత్ర అని.. ఈ పాత్ర కోసం కన్నడ హీరో ఉపేంద్ర ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ స్పెషల్ రోల్ సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట. మరి ఈ పాత్ర చేయడానికి ఉపేంద్ర ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. వెరీ స్టైలిష్ లుక్ లో విభిన్న శైలితో చరణ్, ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌ గా నిలుస్తాడట. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట. చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడు.