బీజేపీ పేరు మార్చుకుంటే మంచిదన్న కేటీఆర్ ..

KTR | BJP: మంత్రి కేటీఆర్‌ బీజేపీ పాలన తీరును ఎంగడుతున్నారు. కమలం నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రకటనలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మునుగోడు ఉపఎన్నికలపై నోటిఫికేషన్‌ అంశంపై బీజేపీ స్పందించడంపై వ్యంగ్యస్త్రాలు సంధించారు.

తెలంగాణ(Telangana)లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ(NDA) కూటమిని ఢీకొట్టడానికి గులాబీ బాస్ కేసీఆర్(KCR) జాతీయ స్థాయి రాజకీయాల్లోకి దిగుతుంటే ..ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌(KTR)బీజేపీ పాలన తీరును ఎంగడుతున్నారు. కమలం నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రకటనలకు ట్విట్టర్(Twitter) వేదికగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మునుగోడు(Munugode)ఉపఎన్నికలపై బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్‌(Sunil Bansal)ఈనెల 15లోపే మునుగోడు ఉపఎన్నికల నోటిఫికేషన్(Notification)వెలువడే అవకాశముందని ..ఐదు అంచెల వ్యూహంతో విజయం సాధించడానికి కృషి చేయాలని పిలుపునివ్వడంపై కేటీఆర్ తనదైన శైలీలో విమర్శలు చేశారు. బీజేపీ పాలకులు జాతీయ దర్యప్తు సంస్థలను తమ చెప్పు చేతల్లోకి తీసుకుంటున్నారన్నట్లుగా విమర్శనాస్త్రాలు సంధించారు కేటీఆర్. అలాగే బీజేపీ పార్టీకి పేరు మార్చుకుంటే మంచిదంటూ కొత్త పేరును సూచించారు.

కమలం నేతలపై కేటీఆర్‌ సెటైర్..

రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. తెలంగాణలో జరుగనుంది ఒక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికే అయినప్పటికి అదే అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి ..ఇటు రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్‌కి ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీని ప్రయోగిస్తున్న కేంద్రం మరోవైపు ఐటీ దాడులు, ఎన్‌ఐఏ సోదాలు, సీబీఐ నోటీసులతో మిగిలిన రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇవి చాలదంటూ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నేతల్ని చేర్చుకుంటూ తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఆదివారం జరిగిన బీజేపీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్‌ 15వ తేదిలోగా మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని ...కాబట్టి ఐదంచెల వ్యూహంతో విజయం సాధించాల్సిందేనంటూ పార్టీ శ్రేణులకు సూచించడంతో మునుగోడు బైఎలక్షన్‌పై క్లారిటీ వచ్చినట్లైంది. దీనిపైనే మంత్రి, టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ..బీజేపీ నేతల తీరును తప్పుపడుతూ ట్వీట్ చేశారు.

వాళ్లకంటే ముందే మీరు చెబితే ఎలా..

ముఖ్యంగా జాతీయ దర్యాప్తు సంస్థలన్ని బీజేపీ చెప్పు చేతల్లోనే ఉన్నాయని ..వాటి కంటే ముందే బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని ఆయన ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. ఎన్నికల కమిషన్‌ కంటే ముందే బీజేపీ నోటిఫికేషన్ వెలువడే తేదీలను ఖరారు చేస్తుందని ...ఈడీ దాడులకు ముందే బీజేపీ నేతలు పేర్లు ప్రకటిస్తారని ..ఎన్‌ఐఏ అడుగులకు ముందుగానే బీజేపీ నిషేద ప్రకటన చేస్తుందని ..ఐటీ రైడ్స్‌కి ముందే బీజేపీ నేతలు ఎంత డబ్బులు దొరికాయో ప్రకటిస్తారని సీబీఐ నోటీసులకు ముందే బీజేపీ నిందితులను ప్రకటిస్తుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు కేటీఆర్.

బీజేపీకి కొత్త పేరు..

బీజేపీ వ్యవహారించే విధానం చూస్తుంటే ఆ పార్టీ తమకు తగినట్లుగా "BJ...EC-CBI-NIA-IT-ED...P" అని మార్చుకుంటే మంచిందంటూ సలహా ఇస్తూనే సెటైర్ వేశారు కేటీఆర్. టీఆర్ఎస్‌ విమర్శలు, సెటైర్లు సీరియస్‌గా తీసుకోని బీజేపీ నేతలు మునుగోడు బైపోల్ విక్టరీతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికపై కూడా కన్నేసినట్లుగా తెలుస్తోంది. ఆదివారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌ను స్పీడప్ చేయడంతో పాటుగా టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని...కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని బన్సాల్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.