హాట్‌కేకుల్లా అమ్ముడైన టిక్కెట్లు

ఈనెల 25వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌ టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల నుంచి ‘పేటీఎమ్‌ ఇన్‌సైడర్‌’ యాప్‌లో టిక్కెట్లు విక్రయించగా రెండు గంటల్లోనే తొలి విడత కోటా మొత్తం ఖాళీ అయిపోయింది. యాప్‌లో బుక్‌ చేసుకున్న టిక్కెట్లను ఈనెల 21 నుంచి 25వ తేదీల మధ్య సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కౌంటర్‌లో చూపించి బార్‌కోడ్‌ గల టికెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. మలి విడత టిక్కెట్లలో కొన్నింటిని మ్యాచ్‌కు 2-3 రోజుల ముందు జింఖానా మైదానంలో విక్రయించే అవకాశం కూడా ఉందని హెచ్‌సీఏ వర్గాలు తెలిపాయి.