తెలంగాణలో మరో మూడు కలెక్టరేట్ సముదాయాలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెలలో మరో మూడు కొత్త సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయాలను ప్రారంభించనున్నారు.

మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని జనవరి 12న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.

అదే రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ఆయన ప్రారంభిస్తారు.

సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 18న ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

2016లో జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యాలయాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కొత్త కలెక్టరేట్ సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది.