ప్రభాస్, మారుతీ ప్రాజెక్ట్ స్టార్ట్ అప్పుడే.!
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు భారీ సినిమాలు పాన్ ఇండియా నుంచి ఆసియ వరల్డ్ లెవెల్లో చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈ చిత్రాల్లో ఒక క్విక్ ప్రాజెక్ట్ గా దర్శకుడు మారుతీ తో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని టేకప్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. అయితే ఈ సినిమాపై ఇప్పుడు లేటెస్ట్ గా మరో అప్డేట్ తెలుస్తుంది.
ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ ఈ నవంబర్ మొదటి వారం నుంచి పట్టాలెక్కించనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై అయితే ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అలాగే ఈ సినిమా అయితే ఒక హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనుండగా చాలా కాలం తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్ తో మారుతి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.
