ఫుల్ స్వింగ్ లో క్రేజీ సీక్వెల్ “డీజే టిల్లు 2”.!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకడైన సిద్ధూ జొన్నలగడ్డ థియేటర్స్ లో పెద్ద బ్రేక్ ని తన లేటెస్ట్ సినిమా “డీజే టిల్లు” తో అదిరే లెవెల్లో అందుకున్నాడు. దర్శకుడు విమల్ తెరకెక్కించిన ఈ చిత్రం రచనలో ఈ యంగ్ హీరో పార్ట్ కూడా ఉండగా ఫస్ట్ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఇప్పుడు యూత్ లో సీక్వెల్ పై సాలిడ్ క్రేజ్ నెలకొంది. అయితే ఈ చిత్రం విషయంలో ఆల్రెడీ నిర్మాతలు క్లారిటీ కూడా ఇచ్చారు.

మరి ఈ చిత్రం అయితే షూటింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుంది. ఫుల్ స్వింగ్ లో మేకర్స్ అయితే ఈ షూట్ ని స్టార్ట్ చేసి కొనసాగిస్తున్నారు. మరి ఆ మధ్య వచ్చిన రూమర్స్ ని నిజం చేస్తూ ఈ చిత్రానికి దర్శకుడు “అద్భుతం” ఫేమ్ మాలిక్ సారథ్యంలో స్టార్ట్ అయ్యింది. మొత్తానికి అయితే టిల్లు క్రేజీ రైడ్ మళ్ళీ స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ సినిమాపై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి.