మళ్లీ జిల్లా పర్యటనలకు సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మళ్లీ జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు. కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయాలను ఆయన ప్రారంభించనున్నారు. ఈనెల 25న గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

29న పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని, సెప్టెంబర్‌ 5న నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని, సెప్టెంబర్‌ 10న జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు ఖరారైనట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది.