నయనతార కనెక్ట్‌ సినిమాకి సంబంధించిన టీజర్ ఈ తేదీలో విడుదల కానుంది

నయనతార కొత్త సినిమా కనెక్ట్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. టీజర్‌ను నవంబర్ 18, 2022న విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు.

సత్యరాజ్, వినయ్ రాయ్, హనియా నఫీసా తదితరులు కూడా ఈ హారర్ థ్రిల్లర్‌లో భాగం. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పృథ్వీ చంద్రశేఖర్ సంగీతం అందించారు.