మ‌హేష్ తండ్రి పాత్ర‌లో బాలీవుడ్ స్టార్‌.. 42 ఏళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొంద‌నున్న చిత్రంలో సీనియ‌ర్ బాలీవుడ్ స్టార్ అనిల్ క‌పూర్ హీరోగా న‌టించ‌బోతున్నారంటూ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారువారి పాట’. మే 12న ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఓ సాంగ్ మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్తి అయ్యింది. ఈ పాట చిత్రీక‌ర‌ణ కూడా జ‌రుగుతుంది. కాగా.. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఎందుకంటే వీలైనంత త్వ‌ర‌గా మ‌హేష్ - త్రివిక్ర‌మ్ మూవీ పూర్తి చేయాల‌నేది మేక‌ర్స్ ప్లాన్‌. అందుకు కార‌ణం.. ఆ సినిమా త‌ర్వాత పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ సినిమా చేయాల్సి ఉంది.

కాగా.. మ‌హేష్ - త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. సీనియ‌ర్ బాలీవుడ్ స్టార్ అనిల్ క‌పూర్ ఈ సినిమాలో మ‌హేష్ తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. నిజానికి ముందు ఈ పాత్ర‌లో మోహ‌న్ లాల్‌ను న‌టింప చేయాల‌ని మేక‌ర్స్ భావించినా, ఆయ‌న అందుకు ఒప్పుకోలేదు. దీంతో త్రివిక్ర‌మ్ కాస్త డిఫ‌రెంట్‌గా ఆలోచించి అనిల్ క‌పూర్‌ను క‌లిశార‌ని టాక్‌.

నిజంగానే అనిల్ క‌పూర్.. మ‌హేష్ - త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తే , ఓ రికార్డ్ క్రియేట్ చేసిన‌ట్టే అవుతుంది. ఎందుకంటే, 42 ఏళ్లు ముందు అంటే 1980లో బాపు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘వంశ వృక్షం’ సినిమాలో అనిల్ కపూర్ నటించారు. అనిల్ కపూర్ కెరీర్ ప్రారంభం అది. తర్వాత సదరు స్టార్ బాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఆయన మహేష్ సినిమాలో నటిస్తే మాత్రం 42 ఏళ్ల తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినట్లే. హీరోయిన్ విషయంలో సెంటిమెంట్ ఫాలో అవుతూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మరోసారి బుట్టబొమ్మ పూజా హెగ్డేనే హీరోయిన్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే.