
రైజర్స్ ఆల్‌రౌండ్ షో
విలియమ్సన్ హాఫ్ సెంచరీ
ముంబై: వరుస ఓటముల నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ నెమ్మదిగా పుంజుకుంటోంది. తాజా సీజన్‌లో ఇప్పటిదాకా పరాజయంలేని గుజరాత్ టైటాన్స్‌కు తమ ఆల్‌రౌండ్‌షోతో షాకిస్తూ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కేన్ విలియమ్సన్ (46 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 57) కెప్టెన్సీ ఇన్నింగ్స్ కనబర్చగా.. అభిషేక్ శర్మ (32 బంతుల్లో 6 ఫోర్లతో 42) ఫామ్ చాటుకున్నాడు. చివర్లో పూరన్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 నాటౌట్) చెలరేగడంతో సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (50 నాటౌట్), అభినవ్ మనోహర్ (35) రాణించారు. భువనేశ్వర్, నటరాజన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో సన్‌రైజర్స్ 19.1 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది. హార్దిక్, రషీద్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా విలియమ్సన్ నిలిచాడు.
ఫామ్‌లోకి విలియమ్సన్: ఓమాదిరి ఛేదనలో రైజర్స్ తొలి నాలుగు ఓవర్లలో చేసింది 11 పరుగులే. ఇందులో ఒక్క ఫోర్ కూడా లేదు. కానీ ఆ తర్వాత ఓపెనర్లు విలియమ్సన్ 4,6.. అభిషేక్ నాలుగు ఫోర్లతో పవర్‌ప్లేను 42 పరుగులతో ముగించారు. నిజానికి తొలి ఓవర్ నాలుగో బంతికే విలియమ్సన్ ఎల్బీ కావాల్సింది. కానీ హార్దిక్ డీఆర్‌ఎ్‌సకు వెళ్లకపోవడంతో బతికిపోయాడు. ఇక ధాటిగా ఆడే ప్రయత్నంలో అభిషేక్ తొమ్మిదో ఓవర్‌లో రషీద్ చేతికి చిక్కాడు. తొలి వికెట్‌కు వీరి మధ్య 64 పరుగులు వచ్చాయి. ఈ దశలో కాస్త వేగం తగ్గినా.. 13వ ఓవర్‌లో విలియమ్సన్ రెండు సిక్సర్లు బాదగా.. మరుసటి ఓవర్‌లో తెవాటియా సిక్సర్‌తో జట్టు వంద పరుగులకు చేరింది. 14వ ఓవర్‌లో తెవాటియా రిటైర్డ్ హర్ట్ కావడంతో పూరన్ బరిలోకి దిగాడు. అటు కేన్ ధాటిని కొనసాగిస్తూ 6,4తో జోరు చూపించాడు. కానీ 42 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అతడిని హార్దిక్ దెబ్బతీశాడు. అయినా టైటాన్స్ సంతోషపడడానికి లేకుండా మరో ఎండ్‌లో పూరన్ బ్యాట్ ఝుళిపించాడు. 12 బంతుల్లో 13 పరుగులు కావాల్సిన వేళ 19వ ఓవర్‌లోనే 12 రన్స్ వచ్చాయి. ఇక పూరన్ సిక్సర్‌తో మరో ఐదు బంతులుండగానే మ్యాచ్ ముుగిసింది.
ఆదుకున్న హార్దిక్-అభినవ్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ ఇన్నింగ్స్ ధాటిగానే ఆరంభమైనా.. డెత్ ఓవర్లలో రైజర్స్ బౌలర్లదే పైచేయి అయ్యింది. టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అభినవ్ మనోహర్ మాత్రమే మెరుగైన ఆటను ప్రదర్శించారు. అయితే పాండ్యా చివరి వరకు నిలిచినా తన సహజశైలిలో హిట్టింగ్ చేయలేకపోయాడు. దీంతో లీగ్‌లో అతడి నెమ్మదైన ఫిఫ్టీ (42 బంతుల్లో) నమోదైంది. తొలి ఓవర్‌లోనే 17 రన్స్ రాబట్టిన జట్టు పవర్‌ప్లేలో గిల్ (7), సుదర్శన్ (11) వికెట్లను కోల్పోయి నప్పటికీ, 51 పరుగులతో మెరుగ్గానే ఉంది. అటు ఆరో ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన హార్దిక్ ఆరంభంలో జాగ్రత్తగా ఆడాడు. 8వ ఓవర్‌లో పాండ్యా రెండు ఫోర్లు సాధించినా ఓపెనర్ వేడ్ (19) అవుటయ్యాడు. ఆ తర్వాత రైజర్స్ బౌలర్లు మరింత పట్టు బిగించడంతో టైటాన్స్ పరుగుల కోసం ఇబ్బంది పడింది. 10-14 ఓవర్ల మధ్య ఒక్క ఫోర్ మాత్రమే సాధించగా మిల్లర్ (12)ను జాన్సెన్ అవుట్ చేశాడు. ఈ సమయంలో అభినవ్ బౌండరీలతో బ్యాట్ ఝుళిపించాడు. అతడిచ్చిన మూడు సులువైన క్యాచ్‌లను రైజర్స్ ఫీల్డర్లు అందుకోలేకపోవడం కూడా కలిసివచ్చింది. 15వ ఓవర్‌లో రెండు ఫోర్లు, 18వ ఓవర్‌లో 6,4తో స్కోరులో కదలిక వచ్చింది. చివరికి 19వ ఓవర్‌లో త్రిపాఠి పట్టిన క్లిష్టమైన క్యాచ్‌తో అభినవ్ ఇన్నింగ్స్‌కు చెక్ పడింది. కానీ అప్పటికే ఐదో వికెట్‌కు 50 పరుగులు జత చేరడం గుజరాత్‌కు ఊరటనిచ్చింది. ఇక చివరి ఓవర్‌లోనూ నటరాజన్ ఏడు పరుగులే ఇచ్చి రషీద్ (0)ను బౌల్డ్ చేయగా, తెవాటియా రనౌటయ్యాడు.
స్కోరుబోర్డుగుజరాత్ టైటాన్స్: మాథ్యూ వేడ్ (ఎల్బీ) ఉమ్రాన్ మాలిక్ 19, శుబ్‌మన్ గిల్ (సి) త్రిపాఠి (బి) భువనేశ్వర్ 7, సాయి సుదర్శన్ (సి) విలియమ్సన్ (బి) నటరాజన్ 11, హార్దిక్ పాండ్యా (నాటౌట్) 50, డేవిడ్ మిల్లర్ (సి) అభిషేక్ శర్మ (బి) జాన్సెన్ 12, అభినవ్ మనోహర్ (సి) త్రిపాఠి (బి) భువనేశ్వర్ 35, రాహుల్ తెవాటియా (రనౌట్/పూరన్/నటరాజన్) 6, రషీద్ ఖాన్ (బి) నటరాజన్ 0, ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: 20 ఓవర్లలో 162/7; వికెట్ల పతనం: 1-24, 2-47, 3-64, 4-104, 5-154, 6-161, 7-162; బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-37-2, మార్కో జాన్సెన్ 4-0-27-1, వాషింగ్టన్ సుందర్ 3-0-14-0, నటరాజన్ 4-0-34-2, ఉమ్రాన్ మాలిక్ 4-0-39-1, ఆడెన్ మార్‌క్రమ్ 1-0-9-0.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ (సి) సాయి సుదర్శన్ (బి) రషీద్ ఖాన్ 42, కేన్ విలియమ్సన్ (సి) తెవాటియా (బి) హార్దిక్ 57, రాహుల్ త్రిపాఠి (రిటైర్డ్ హర్ట్) 17, నికోలస్ పూరన్ (నాటౌట్) 34, ఆడెన్ మార్‌క్రమ్ (నాటౌట్) 12, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19.1 ఓవర్లలో 168/2; వికెట్ల పతనం: 1-64, 1-104, 2-129; బౌలింగ్: మహ్మద్ షమీ 4-0-32-0, హార్దిక్ పాండ్యా 4-0-27-1, ఫెర్గూసన్ 4-0-46-0, రషీద్ ఖాన్ 4-0-28-1, దర్శన్ నాల్కండే 2.1-0-22-0, రాహుల్ తెవాటియా 1-0-10-0.