రామ్ – బోయపాటి మూవీ షూట్ లో జాయిన్ అయిన శ్రీలీల

ఇటీవల అఖండ మూవీతో అతి పెద్ద సక్సెస్ అందుకుని దర్శకుడిగా మరింత క్రేజ్ సొంతం చేసుకున్న మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను లేటెస్ట్ గా రామ్ పోతినేనితో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా పలువురు ముఖ్య నటులు కీలక పాత్రలు చేస్తున్నారు.

ఇక పూర్తి అప్ డేట్స్ త్వరలో వెల్లడి కానున్న ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. ఇటీవల రవితేజ తో చేసిన ధమాకా మూవీతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల వరుసగా ప్రస్తుతం ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, నేడు రామ్ – బోయపాటి ల మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు శ్రీలీల. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు రామ్ ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఈ మూవీ యొక్క స్క్రిప్టుని అద్భుతంగా సిద్ధం చేసారట దర్శకుడు బోయపాటి. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీకి సంతోష్ డేటాకే డీవోపీ గా వర్క్ చేస్తుండగా ఎడిటింగ్ ని తమ్మిరాజు అందిస్తున్నారు.