
తిరుపతి వెళ్లాలనుకుంటున్న వారికి శుభవార్త.. కాచిగూడ నుంచి స్పెషల్ ట్రైన్
హైదరాబాద్ జంట నగరాల నుంచి తిరుపతి వెళ్లాలనుకుంటున్న వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
సమ్మర్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో హాలిడేస్ కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు సైతం అనేక మంది సిద్ధం అవుతున్నారు. ఇలాంటి వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07297: కాచిగూడ-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను మే 4న నడపనున్నారు. ఈ ట్రైన్ 22.20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 11.00 గంటలకు గమ్యానికి చేరుతుంది.
Train No.07298: తిరుపతి-కాచిగూడ స్పెషల్ ట్రైన్ ను మే 5న నడపనున్నారు. ఈ ట్రైన్ 15.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 4.00 గంటలకు గమ్యానికి చేరుతుంది.
ఈ రెండు ట్రైన్స్ ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ మరియు జనరల్, సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని ప్రకటనలో వెల్లడించారు.