“ఉస్తాద్ భగత్ సింగ్” రిలీజ్ పై సాలిడ్ క్లారిటీ.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఆల్రెడీ ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోగా ఇపుడు పవన్ పొలిటికల్ పనులు రీత్యా బ్రేక్ లో ఉంది.

ఇక దీనితో ఈ సినిమాపై అనేక రూమర్స్ వైరల్ గా మారగా వీటి అన్నిటికి అయితే లేటెస్ట్ గా వాల్తేరు వీరయ్య 200 డేస్ వేడుకల్లో మైత్రి మూవీ మేకర్స్ వారు కన్ఫర్మ్ చేశారు. ఏఈ చిత్రం ఆగిపోలేదు అని అతి త్వరలోనే షూటింగ్ రీస్టార్ట్ చేస్తామని ఇక అలాగే రిలీజ్ పై కూడా మాట్లాడుతూ వచ్చే ఏడాది సంక్రాంతికి గాని లేదా వేసవి కానుకగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నామని అయితే కన్ఫర్మ్ చేశారు. దీనితో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఉన్న రూమర్స్ అన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోయాయి అని చెప్పొచ్చు.