ఆకాశంలోనే షాపింగ్ మాల్స్‌, రెస్టారెంట్స్‌, థియేట‌ర్లు.. మీకు వెళ్లాల‌ని ఉం

Sky Cruise Plane | స్కై క్రూయిజ్‌.. ఆకాశంలో ఎగిరే షిప్‌! వినేందుకు వింతగా ఉన్నా నిజం. ఆకాశంలో చక్కర్లు కొట్టే ఓ అంతరిక్ష నౌకలోకి భూమి మీది నుంచి అతిథులను తీసుకెళ్తారు. విందులు ఆరగించాక.. మళ్లీ వెనక్కి తీసుకొస్తారు. వింటేనే వెళ్లాలనిపిస్తుంది కదూ!

ఈ విమానంలో అణు ఇంధనంతో నడిచే 20 ఇంజిన్లు ఉంటాయి. దీంతోపాటు చిన్నపాటి అణు రియాక్టర్‌ కూడా ఏర్పాటుచేయడంతో ఇంధన సమస్య పెద్దగా ఉండదు. సంవత్సరాల తరబడి మేఘాల్లో తేలిపోగలదు. ఈ విమాన నౌకలో సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్స్‌, బార్లు, థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉంటాయి. ప్రకృతిని ఆస్వాదించడానికి బాల్కనీలు, చుట్టూ చూడటానికి డోమ్స్‌ డిజైన్‌ చేశారు. భూమి మీదున్నవాళ్లతో మాట్లాడటానికి కాన్ఫరెన్స్‌ సెంటర్‌ కూడా ఉంది. ఒకేసారి ఐదువేల మంది ఆతిథ్యం స్వీకరించవచ్చు. ప్రస్తుతానికి ఈ మేఘాల రెస్టారెంట్‌ డిజైనింగ్‌ దశలోనే ఉంది.