
సెన్సేషనల్ “ధమాకా”..100 కోట్ల క్లబ్ లో ఎంట్రీ.!
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “ధమాకా”. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీ లీలా హీరోయిన్ గా నటించగా కితం నెల క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సంక్రాంతి పండుగకి విజయవంతంగా దూసుకెళ్తుంది. ఈ రెండు వారాలు కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో ధమాకా మానియా కి ఎదురు లేదు.
దీనితో ఈ చిత్రం వసూళ్లు కూడా రవితేజ కెరీర్ లో రికార్డు మొత్తంలో నమోదు అవుతుండగా ఇక లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దీనితో చిత్ర యూనిట్ మాసివ్ మార్క్ తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సక్సెస్ తో అయితే రవితేజ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మళ్ళీ ప్రూవ్ చేసారని చెప్పాలి.