200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ కొత్త ఫోన్

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయింది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా వచ్చే సంవత్సరం ప్రారంభంలో లాంచ్ కానుంది. అయితే ఈ విషయాన్ని శాంసంగ్ అధికారికంగా ప్రకటించలేదు.

కొరియా ఐటీ న్యూస్ అందించిన నివేదిక ప్రకారం... శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌లో కేవలం అల్ట్రా వేరియంట్‌లో మాత్రం ఈ కెమెరా ఉండనుంది.

శాంసంగ్ ఇటీవలే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 స్మార్ట్ ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799.99 డాలర్లుగా (సుమారు రూ.1,42,700) ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ల ధరలు కంపెనీ ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు. బీజ్, గ్రేగ్రీన్, ఫాంటం బ్లాక్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్.కాం వెబ్‌సైట్లో ఎక్స్‌క్లూజివ్‌గా బర్గండీ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.