
అఫీషియల్: సలార్ రిలీజ్ వాయిదా…కొత్త డేట్ అనౌన్స్ మెంట్ పై క్లారిటీ!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ సెప్టెంబర్ 28, 2023 న రిలీజ్ కావల్సి ఉంది. అయితే ఈ చిత్రం వాయిదా పడటం పట్ల మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. సలార్ చిత్రం పై మీరు చూపిస్తున్న సపోర్ట్ కి అభినందనలు. అయితే అనుకోని కారణాల వలన సినిమా రిలీజ్ అయిన సెప్టెంబర్ 28 వ తేదీ నుండి వాయిదా వేస్తున్నాం. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం, కాబట్టి ఈ నిర్ణయాన్ని అర్దం చేసుకోండి. సినిమా ను హయ్యెస్ట్ స్టాండర్డ్స్ లో అందించడానికి అవిశ్రాంతంగా టీమ్ శ్రమిస్తోంది అని టీమ్ పేర్కొంది.
అయితే కొత్త రిలీజ్ డేట్ ను గడువు లోగా (సెప్టెంబర్ 28, 2023) వెల్లడించనున్నారు మేకర్స్. సలార్ సీజ్ ఫైర్ కి తుది మెరుగులు దిద్దుతున్నట్లు, ఈ అద్భుతమైన ప్రయాణం లో భాగం అయినందుకు థాంక్స్ అని చిత్ర యూనిట్ పేర్కొంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో, పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి లు కీలక పాత్రల్లో నటించారు.