తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు ఘరంగా జరిగాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఒక్కచోట చేరి సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు హైదరాబాద్ నగరంలోని ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ పైనా బతుకమ్మలు పెట్టి పాటలు పాడారు. ఈ ర్యాలీలో కళాకారుల ప్రదర్శలు ఆకట్టుకున్నాయి.ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మలతో హుస్సేన్‌సాగర్‌ కాంతులీనింది. 

పూల పండగలో మహిళలు హనుమకొండ పద్మాక్షి అమ్మవారి గుండం వేలాది మంది మహిళలతో కిక్కిరిసిసోయింది. వేయి స్తంభాల గుడి వద్ద పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, అన్ని జిల్లాల్లోనూ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 

సద్దుల బతుకమ్మ సంబరాలు మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కరీనంగర్ జిల్లా కేంద్రంలోనూ సద్దుల బతుకమ్మ వేడుకలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మెదక్‌లోనూ ఉత్సాహంగా మహిళలు సద్దుల బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు. బతుకమ్మ సంబరాల్లో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆడిపాడిన మహిళలు హైదరాబాద్ నగరంలో బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలతో కలిసి కవిత ఆడిపాడారు. సూర్యాపేటలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా సాగాయి. ఖమ్మంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో భారీసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ, కోలాటం ఆడుతూ సంబరాలు చేసుకుని.. బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు. ఇది ఇలావుండగా, దుబాయ్ లోని బూర్జుఖలిఫాపైనా బతుకమ్మ వెలుగులు విరజిమ్మడం విశేషం.