హిస్టారికల్ “RRR”..గోల్డెన్ గ్లోబ్స్ లో మొదటి అవార్డు.!

పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హిట్ గా నిలిచిన మన టాలీవుడ్ సహా ఇండియన్ ప్రైడ్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి అండ్ టీం కఠోర శ్రమకి నిదర్శనంగా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఇండియన్ సినిమా కూడా అందుకోని మాసివ్ సక్సెస్ ని అందుకుంది.

మరి ఈ సక్సెస్ ప్రయాణంలో ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్స్ లో ఒకటైన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ లో మొదటగా రెండు నామినేషన్స్ లో చోటు దక్కించుకోగా ఈ ఉదయమే గుడ్ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు సహా ఇండియా మూవీ లవర్స్ కి గోల్డెన్ గ్లోబ్స్ వారు అందించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా అయితే సినిమాలో సెన్సేషనల్ చార్ట్ బస్టర్ “నాటు నాటు” గెలిచినట్టుగా అనౌన్స్ చేసి సినిమా సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కి అవార్డు అందజేశారు.

దీనితో ఈ ఇంటర్నేషనల్ అవార్డు గెలిచినా మొదటి సినిమాగా RRR నిలిచి హిస్టారికల్ ఫీట్ ను అందుకుంది. మరి చిత్ర యూనిట్ కూడా కీరవాణి ఫోటో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన పాటను అయితే సాహిత్య రచయిత చంద్రబోస్ రచించగా రాహుల్ సిప్లిగంజ్ మరియు యాజిన్ నైజర్ లు ఆలపించారు.