నాన్న‌లాగే కూతురు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమార్తె ఆద్య వీడియో వైర‌ల్‌

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య‌.. న‌టి, ద‌ర్శ‌కురాలు రేణు దేశాయ్ (Renu Desai) రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో.. చేసిన కామెంట్స్ తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఆమె షేర్ చేసిన వీడియో, పోస్ట్ చేసిన కామెంట్స్ దేని గురించో తెలుసా!.. ప‌వ‌న్ క‌ళ్యాన్ కుమార్తె ఆద్య (Aadya) గురించి. వీడియో గ‌మ‌నిస్తే అందులో ప్ర‌యానిస్తున్న‌ కారు పైనున్న గ్లాస్‌ను ఓపెన్ చేసి ఆద్య బ‌య‌ట నిల‌బ‌డి ఎంజాయ్ చేస్తుంది. దీన్ని వీడియో తీసిన రేణు దేశాయ్‌.. లైక్ నాన్న లైక్ కూతురు అనే పోస్ట్ పెట్టింది. అంటే నాన్న ఎలాగో కూతురు అలాగే అని.

రేణు దేశాయ్ అలా ప‌ర్టికుల‌ర్‌గా కామెంట్ చేయ‌టం వెనుకున్న కార‌ణ‌మేంటంటే.. రీసెంట్ ఇప్ప‌టం గ్రామానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెళ్లిన‌ప్పుడు అక్క‌డ ఆయ‌న పాద‌యాత్ర చేయ‌టం.. జ‌రిగిన ఘ‌ట‌న‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌స మ‌యంలో ఆయ‌న త‌న కారు టాప్‌పై కూర్చుని ట్రావెల్ చేశారు. దీనిపై పోలీస్ స్టేష‌న్‌లోనూ ఫిర్యాదు కూడా వెళ్లింది. అయితే జ‌న‌సేనాని అలా కారు టాప్‌లో కూర్చుని ప్ర‌యాణించిన వీడియో (Aadya Video) నెట్టింట తెగ వైర‌ల్ అయ్యింది.

ఇప్పుడు ఫ్యాన్స్ (Pawan Kalyan fans) రేణు దేశాయ్ పోస్ట్ చేసిన వీడియో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీడియోల‌ను క‌లిపి ఎడిట్ చేసి, ఆమె చేసిన కామెంట్‌ను జ‌త చేస్తున్నారు. వీడియో వైర‌ల్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం నెట్టింట ఆ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ ఇప్పుడు పూనేలో కొడుకు అకీరా నంద‌న్‌ (Akira Nandan), కుమార్తె ఆద్య‌ల‌తో క‌లిసి ఉంటున్నారు.

Link

https://www.instagram.com/p/Ck5z-9RBync/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again