Redmi Note 11SE : రూ.13,499 ధరకే

రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ అయింది. బడ్జెట్ రేంజ్‌లో AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ శుక్రవారం విడుదలైంది. ఈనెల 31వ తేదీన ఈ ఫోన్ సేల్‌కు వస్తుంది. ముఖ్యంగా డిస్‌ప్లే, డ్యుయల్ స్పీకర్స్, 5000mAh బ్యాటరీ ఈ ఫోన్‌కు ప్రధాన సానుకూల అంశాలుగా ఉన్నాయి. ఫాస్ట్ చార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. Redmi Note 11SE ధర, సేల్, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

Redmi Note 11SE ధర, సేల్
6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న రెడ్‌మీ నోట్ 11ఎస్ ధర రూ.13,499గా ఉంది. ఒకే వేరియంట్‌లో ఈ మొబైల్‌ను రెడ్‌మీ లాంచ్ చేసింది. బిఫ్రోస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్, థండర్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, షావోమీ వెబ్‌సైట్ (mi.com)ల్లో ఈనెల 31వ తేదీన ఈ రెడ్‌మీ నయా బడ్జెట్ మొబైల్ సేల్‌కు వస్తుంది.
అమెజాన్ బడ్జెట్ స్టోర్ | హై టెక్నాలజీ, తక్కువ ధర | టీవీల ప్రారంభ ధర రూ. 6,999/- మాత్రమే!

Also Read: 108 మెగాపిక్సెల్ కెమెరా, AMOLED డిస్‌ప్లేతో Infinix Note 12 Pro విడుదల
Redmi Note 11SE స్పెసిఫికేషన్లు
6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లేతో రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ వస్తోంది. 1,100 నిట్ పీక్‌ బ్రైట్‌నెస్, 409ppi పిక్సెల్ డెన్సిటీ, DCI-P3 కలర్ గాముట్, సన్‌లైట్ మోడ్ 2.0 డిస్‌ప్లే ఫీచర్లుగా ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ95 4జీ ప్రాసెసర్ ఈ మొబైల్‌లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 బేస్ట్ ఎంఐయూఐ 12.5 ఓఎస్‌తో ఈ ఫోన్ వస్తోంది. 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండగా.. మైక్రో ఎస్‌డీకార్డ్ స్లాట్‌ను కూడా రెడ్‌మీ పొందుపరిచింది.

వెనుక నాలుగు కెెమెరాల సెటప్‌తో Redmi Note 11SE వస్తోంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా‌తో ఈ ఫోన్ వస్తోంది. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. డ్యుయల్ స్పీకర్ సెటప్‌ను ఈ మొబైల్ కలిగి ఉంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ పవర్‌బటన్‌కే ఇచ్చింది రెడ్‌మీ.

Redmi Note 11SE మొబైల్‌లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. నీటి బిందువుల నుంచి రక్షణ కోసం IP53 రేటింగ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చినట్టు రెడ్‌మీ వెల్లడించింది. మొత్తంగా ఈ మొబైల్ 178.8 గ్రాముల బరువు ఉంటుంది.