బీట్‌రూట్‌ బజ్జీ ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి!

వర్షాకాలంలో బీట్‌రూట్‌ బజ్జీ ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని ఎంచక్కా తినేయండి!
బీట్‌రూట్‌ బజ్జీ తయారీకి కావలసినవి:  
►బీట్‌రూట్‌ – 3 (పెద్దవి, పైతొక్క తొలగించి.. గుండ్రటి చక్రాల్లా కట్‌ చేసుకోవాలి)
►శనగపిండి – 1 కప్పు, ఉప్పు, కారం – సరిపడా, కార్న్‌ పౌడర్‌ – పావు కప్పు

►బేకింగ్‌ సోడా – కొద్దిగా, నీళ్లు – కావాల్సినన్ని
►నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

బీట్‌రూట్‌ బజ్జీ తయారీ:
►ముందుగా ఒక బౌల్‌లో శనగపిండి, కార్న్‌ పౌడర్, ఉప్పు, కారం, గరం మసాలా, బేకింగ్‌ సోడా వేసుకోవాలి.
►కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ తోపులా చేసుకోవాలి.

►అందులో బీట్‌రూట్‌ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ముంచి.. నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
►ఈ బజ్జీలను వేడి వేడిగా ఉన్నప్పుడే సాస్‌ లేదా చట్నీల్లో నంజుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.