రామ్ ‘స్కంద’ సెన్సార్ పూర్తి & రన్ టైం లాక్ ?

రామ్ పోతినేని లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై హైప్ మరింతగా పెంచేసాయి.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న స్కంద సెప్టెంబర్ 28న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే విషయం ఏమిటంటే, తాజాగా స్కంద సెన్సార్ పూర్తి చేసుకోగా ఈ మూవీకి సెన్సార్ వారు యు / ఏ సర్టిఫికెట్ కేటాయించారట. అలానే ఈ మూవీ యొక్క రన్ టైం 167 నిముషాలు అనగా 2 గం. 47 ని. అని తెలుస్తోంది. మరి తొలిసారిగా స్కంద ద్వారా పాన్ ఇండియన్ మూవీ చేస్తోన్న రామ్ ఎంతమేర సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.

Tags: