
కంగ్రాట్స్ రాజమౌళి గారు – రామ్ చరణ్
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం గ్లోబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం కి ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. తాజాగా జక్కన్న కి న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ను అందజేసింది. ఈ అవార్డ్ ను అందుకోవడం పట్ల సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ ఎస్ కార్తికేయ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కి గానూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు.
ఇలాంటి అవార్డులు ఇంకా యాడ్ కావాలని ఆకాంక్షించారు. కంగ్రాట్స్ రాజమౌళి గారు అంటూ చెప్పుకొచ్చారు. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించారు. ఈ చిత్రం తో గ్లోబల్ స్టార్డం సొంతం చేసుకున్నారు ఈ హీరోలు. ఈ చిత్రం లో ఆలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్, అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.