మ‌రో అరుదైన ఘ‌న‌త‌ సాధించిన ‘పుష్ప’ మూవీ..!

Pushpa Movie Another Record | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియ‌స్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘పుష్ప‌’. భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌తేడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచ‌నాల్లేకుండా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. పోటీగా ’83’, ‘స్పైడ‌ర్‌మ్యాన్ నో వే హోమ్’ వంటి సినిమాలు ఉన్నా..పుష్ప ధాటికి వాటి క‌లెక్ష‌న్స్ దారుణంగా ప‌డిపోయాయి. సుకుమార్ టేకింగ్‌, విజ‌న్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఇక బ‌న్నీ తన యాక్టింగ్‌, మేన‌రిజంల‌తో ప్రేక్ష‌కులను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ చిత్రం రూ.350 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించి గ‌తేడాది ఇండియాస్‌ హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఇప్ప‌టికే ఈ చిత్రం ప‌లు అవార్డులను గెలుచుకుంది. కాగా ఈ చిత్రం మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది.

మాస్కోలో జ‌రిగే అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వంలో, ప్ర‌పంచ వ్యాప్తంగా బ్లాక్ బస్ట‌ర్ హిట్ చిత్రాల విభాగంలో ఈ ఏడాది పుష్ప ఎంపికైంది. ఇక‌ పుష్ప రికార్డుల ప‌రంప‌ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రంతో అల్లుఅర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌స్తుతం సౌత్‌, నార్త్ అని తేడా లేకుండా ఈ మూవీ సీక్వెల్ కోసం ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న పుష్ఫ‌-2 త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లు పెట్ట‌నుంది.