
‘ఎఫ్ 3’ : జిగేల్‌రాణి పారితోషికం ఎంతంటే !
విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్ 3’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా కంటిన్యూ అవుతుండగా.. సునీల్ పాత్ర అదనంగా చేరుతోంది. మే 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతోంది.
‘సమ్మర్ సోగ్గాళ్ళు’ అనే ట్యాగ్ లైన్ తో వేసవి వినోదాన్ని అందించడానికి రెడీ అవుతోంది. పాటలు మినహా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా కోసం ఓ ఐటెమ్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. ఆ పాటకోసం బుట్టబొమ్మ పూజా హెగ్డే రంగంలోకి దిగుతోంది. ‘రంగస్థలం’ చిత్రం తర్వాత పూజా నర్తించబోయే ప్రత్యేక గీతం ఇదే అవడం విశేషం.
అయితే ఈ ప్రత్యేకగీతం కోసం పూజా హెగ్డే దాదాపు రూ. 1 కోటి పారితోషికం అందుకున్నట్టు సమాచారం. ఇంతకు ముందు ఆమె చేసిన ‘రంగస్థలం’ చిత్రంలోని జిగేల్ రాణి గీతం సూపర్ హిట్ అవడంతో ఎఫ్ 3 కోసం ఆమె డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారట. ఈ పాట కూడా అదే స్థాయిలో సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. పూజా నటించిన ‘బీస్ట్’ తమిళ చిత్రం రేపే (ఏప్రిల్ 13) విడుదల కాబోతోంది. అలాగే ఆమె నటించిన మరో చిత్రం ‘ఆచార్య’ ఈ నెల 29న విడుదల కానుంది. పూజా నటించిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్టైతే.. వచ్చే నెల్లో రాబోయే ‘ఎఫ్ 3’ చిత్రానికి మరింత అడ్వాంటేజ్ కాబోతోంది. మరి ‘ఎఫ్ 3’ చిత్రానికి పూజా ఐటెమ్ సాంగ్ ఏ స్థాయిలో హైలైట్ అవుతుందో చూడాలి.