అద్దీ లెక్క…పవన్ “భీమ్లా నాయక్” ప్రకటన తో రచ్చ షురూ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న చిత్రం కి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. అంతేకాక సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకు, వీడియో లకు, పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రం ను అనుకున్న తేదీ అయిన ఫిబ్రవరి 25, 2022 కి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ మరొకసారి ప్రకటన చేయడం తో రచ్చ షురూ అయింది. మేరకు ప్రముఖ రచయిత రామ జోగయ్య శాస్త్రి గారు సోషల్ మీడియా వేదిక గా అద్దీ లెక్క డంగరనక్కర డంగరానక్కర డడ్డామ్ డడం డంగరనక్కరఅంటూ తనదైన శైలి లో చెప్పుకొచ్చారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక టాలీవుడ్ లో చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు.