“సీతారామం” కి ఓవర్సీస్ లో ఊహించని టార్గెట్.?

ఈ వారం థియేటర్స్ లో సందడి చేయడానికి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా అలాగే హీరోయిన్ రష్మికా మందన్నా కీలక పాత్రలో నటించిన చిత్రం “సీతారామం” కూడా ఒకటి. క్లాస్ అండ్ లవ్ చిత్రాల స్పెషలిస్ట్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం డీసెంట్ బజ్ మరియు సాలిడ్ ప్రమోషన్స్ మధ్య రిలీజ్ కి వస్తుంది.

అయితే ఈ సినిమా బిజినెస్ లెక్కల పరంగా ట్రేడ్ వర్గాలు ఊహించని అంశాలే వెల్లడి చేస్తున్నారు. లేటెస్ట్ గా అయితే ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ పై షాకింగ్ నెంబర్ బయటకి వచ్చింది. ఈ చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్ లో 7 లక్షల డాలర్స్ మేర టార్గెట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ టైమ్స్ లో ఇది హైయెస్ట్ అని చెప్పాలి. మరి ఈ సినిమా ఇంత మొత్తాన్ని రాబడుతుందో లేదో అనేది ఆసక్తిగా ఇపుడు మారింది.