Oats Cheese Balls Recipe | ఓట్స్ చీజ్ బాల్స్ తయారీ విధానం
Oats Cheese Balls Recipe | ఓట్స్ చీజ్ బాల్స్ తయారీకి కావలసిన పదార్థాలు
ఆలుగడ్డలు: రెండు, చీజ్ తురుము: రెండు టేబుల్ స్పూన్లు, మసాలా ఓట్స్: అర కప్పు, మైదా: రెండు టేబుల్ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్: పావుకప్పు, మిరియాల పొడి: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
Oats Cheese Balls Recipe | ఓట్స్ చీజ్ బాల్స్ తయారీ విధానం
ముందుగా ఆలుగడ్డల్ని ఉడకబెట్టి మెత్తగా మెదపాలి. ఓట్స్‌ను మిక్సీ జార్‌లో వేసి బరకగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో మైదా వేసి కొద్దిగా నీళ్లుపోసి జారుగా కలపాలి. మరో గిన్నెలో ఆలూ ముద్ద, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి.. తగినంత కార్న్‌ఫ్లోర్, చీజ్ వేసి ముద్దగా చేసుకుని అరగంటపాటు మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడి చేయాలి. మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలు చేసుకుని మైదా మిశ్రమంలో ముంచి, ఓట్స్‌లో దొర్లించాలి. ఆ ఉండలను కాగిన నూనెలో వేసి దోరగా కాల్చుకుంటే నోరూరించే ఓట్స్ చీజ్ బాల్స్ సిద్ధం.
