న్యూఢిల్లీ లో గ్రాండ్ గా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమం!

నందమూరి తారక రామారావు, నట సార్వభౌముుని శత జయంతి సందర్భంగా స్మారక నాణెం ను విడుదల చేయడం జరిగింది. అందుకు సంబందించిన కార్యక్రమం న్యూ ఢిల్లీ లో చాలా గ్రాండ్ గా జరిగింది. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో కార్యక్రమం జరిగింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నాణెం విడుదల చేశారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణెం విడుదల చేయడం తో ఆయన అభిమానులు తెలుగు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ ఎంపీలు, నాయకులు, బీజేపీ ఎంపీలు, మాజీ ఎంపీలు హాజరయ్యారు.

Tags: