
కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్ అప్‌డేట్.. జోరు పెంచిన నిఖిల్ టీమ్
కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటించారు. తాజాగా ఈ సినిమా సెకండ్ ట్రైలర్ గురించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.
చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth) హీరోగా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ 1 పై అద్భుతమైన స్పందన వచ్చింది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ 1 ఆకట్టుకుంటుంది.
ఈ నేపథ్యంలో ఆగష్టు 6న కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ట్రైలర్ 1తో ఈ సినిమా పై వచ్చిన అంచనాలకు మించే స్థాయిలో ఈ థియేట్రికల్ ట్రైలర్ ఉండనుందట. కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానుందని మేకర్స్ అంటున్నారు. టెక్నీషియన్స్‌తో అద్బుతమైన ఔట్ పుట్ తీసుకురావడంలో ఎంతో శ్రద్ద తీసుకున్నారట డైరెక్టర్ చందూ మొండేటి.
కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ 2 అంచనాలు అందుకోవడం కాదు.. ఆ సినిమాను మించి పోయేలా ఉంటుందని అంటున్నారు దర్శకుడు చందూ. ఈ చిత్రంలో నిఖిల్ కి జంటగా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) నటిస్తోంది. ముగ్ధ పాత్రలో ఆమె కనిపించనుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్టర్ కార్తికేయ ప్రయాణం. శ్రీకృష్ణుడు చరిత్రలోకి ఎంటరవుతూ కనిపిస్తున్నారు.
ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 12న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. కార్తికేయ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో జనం చూపు ఈ సినిమాపై పడింది. సో.. చూడాలి మరి ఈ సీక్వల్ ఏ మేర విజయం సాధిస్తుందనేది!.