
హీరోయిన్ రష్మిక నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
సినిమాలతో పాటు వారి వ్యక్తిగత విషయాలు గురించి కూడా సోషల్ మీడియాలో కోడై కూస్తుంటారు. ఇక ట్రోల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
స్టార్ డామ్ వచ్చిన తర్వాత సెలబ్రెటీల పై జనాల ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సోషల్ మీడియాలో నిత్యం ఆ సెలబ్రెటీల గురించి ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటాయి. సినిమాలతో పాటు వారి వ్యక్తిగత విషయాలు గురించి కూడా సోషల్ మీడియాలో కోడై కూస్తుంటారు. ఇక ట్రోల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చిన్న తప్పు చేసిన సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. తాజాగా హీరోయిన్ రష్మిక నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మడు ఇప్పటికే పలు కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. గతంలో రిషబ్ శెట్టి కాంతార సినిమా సమయంలో రష్మిక చేసిన కామెంట్స్. తెగ వైరల్ అయ్యాయి. దాంతో ఆమె ట్రోల్స్ కు గురైంది.
తాజాగా ఆమె డ్రసింగ్ పై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.. రీసెంట్ గా ఒక ఈవెంట్ కు హాజరైన రష్మిక వెరైటీ డ్రస్ లో దర్శనమించింది. చాలా పొట్టి దుస్తుల్లో కనిపించింది రష్మిక. అందాలు ఆరబోస్తూ.. రష్మిక వేసుకున్న డ్రస్ పై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది రష్మిక.
మరి అంత శృతిమించాల్సిన అవసరం లేదు అంటూ కొందరు.. బాలీవుడ్ లో సినిమా ఛాన్స్ ల కోసమే రష్మిక ఇలా డ్రస్ లు వేసుకొని స్కిన్ షో చేస్తుందని మండిపడుతున్నారు. ఆమె అభిమానులు కూడా పబ్లిక్ లో ఇలాంటి డ్రస్ వేసుకోవడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.