కళ్యాణ్ రామ్ కొత్త సినిమా.. టైటిల్‌ ఇంట్రెస్టింగ్

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ సోషియో ఫాంటసీ బింబిసార. ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక బింబిసార విజయం తర్వాత ఆయన తాజాగా ఓ కొత్త సినిమాను ప్రకటించారు.

బింబిసారతో హిట్‌తో బంపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రానికి అమిగోస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఇక తాజాగా విడుదలైన పోస్టర్ మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 10, 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ రిసెంట్ యాక్షన్ థ్రిల్లర్‌లో కన్నడ నటి ఆషిక రంగనాథ్ నటిస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. 

ఇక నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో కేక పెట్టించింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్.. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించారు.

వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు. చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్‌కు ఈ సినిమాతో మంచి హిట్ పడింది.  ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇక ఓటీటీలో అలరించనుంది. ఈ సినిమా దీవావళీ కానుకగా జీ5లో అక్టోబర్ 21న స్ట్రీమింగ్‌కు రానుందని అధికారిక ప్రకటన విడుదలైంది. దీంతో మరోసారి ఈ సినిమాను చూడోచ్చని సంబర పడిపోతున్నారు సినీ ప్రేక్షకులు.

నందమూరి కళ్యాణ్ రామ్ ఇతను హీరోగానే  కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా  నటిస్తూ నిర్మించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara) . ఈ సినిమాలో కళ్యాన్ రామ్ సరసన హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు.ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ. 2.09 కోట్ల లాభాల్లోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది

పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనివిందు చేశాడు.ఈ సినిమా విజయంలో కీరవాణి అందించిన సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలిచింది.

బింబిసారలో కళ్యాణ్ రామ్. రాజుగా.. సాధారణ వ్యక్తిగా కళ్యాణ్ రామ్ ఆహార్యం బాగుంది. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసాడు.  కళ్యాణ్ రామ్ బింబిసార ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ) రూ. 5 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ) రూ. 2 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ రూ. 6.50 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 13.50 కోట్లు.. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ - రూ. 1.1 కోట్లు.. ఓవర్సీస్ - రూ. 1 కోటి రూపాయలు టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 15.60 కోట్లు.. బ్రేక్ ఈవెన్ రూ. 16.20 కోట్లు రాబట్టాలి. (Twitter/Photo).

పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందించారు, వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనివిందు చేశాడు.ఈ సినిమా విజయంలో కీరవాణి అందించిన సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలిచింది. 

బింబిసారలో కళ్యాణ్ రామ్. రాజుగా.. సాధారణ వ్యక్తిగా కళ్యాణ్ రామ్ ఆహార్యం బాగుంది. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసాడు. 

మూవీతో పాటు .. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.