సోదరుడికి రాఖీ కట్టిన కవిత.. చిన్ననాటి ఫొటోలతో కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కి ఎమ్మెల్సీ కవిత రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆమె తన సోదరుడికి రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
కేటీఆర్‌కి రాఖీ కడుతున్న సోదరి కవిత
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కి ఎమ్మెల్సీ కవిత రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆమె తన సోదరుడికి రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
కపివ 100% స్వచ్ఛమైన హిమాలయన్ శిలాజిత్
అయితే, అంతకుముందు రక్షాబంధన్ నేపథ్యంలో కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేటీఆర్, కవిత చిన్ననాటి ఫొటోలతో పాటు తన పిల్లలు హిమాన్ష్, అలేఖ్య ఫొటోలను పోస్ట్ చేశారు. కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి అంటూ ఆయన జోడిస్తూ చేసిన పోస్టింగ్‌కి నెటిజన్ల నుంచి మంచి కామెంట్స్ వచ్చాయి. రాఖీ పండగ రోజు కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారింది.