Miss India 2022 : ఫెమినా మిస్ ఇండియాగా సిని శెట్టి.. తెలంగాణ అమ్మాయికి నాలుగో స్థానం..

ఫెమినా మిస్ ఇండియా 2022(Miss India 2022) కిరీటాన్ని కర్ణాటకకి చెందిన సినీ శెట్టి కైవసం చేసుకున్నారు. ముంబైలోని రిలయన్స్ జియో కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం 58వ ఫెమినా అందాల పోటీలు జరిగాయి. ఇందులో అనేక రాష్ట్రాలకు చెందిన 31 మంది ఫైనలిస్టులు పోటీ పడ్డారు. ఇందులో సినీ శెట్టి తన అందంతో టైటిల్‌ని కైవసం చేసుకున్నారు. తెలంగాణ అమ్మాయి ప్రజ్ఞా అయ్యగారి నాలుగో స్థానంలో నిలిచారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకోండి...

ఈ సంవత్సరం ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ని సిని శెట్టి గెలుచుకుంది. కర్ణాటటకు చెందిన 21 ఏళ్ళ సినీ శెట్టి.. జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన వేడుకల్లో తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన సినీ శెట్టి కర్ణాటకకి చెందిన యువతి.. ఈమె అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో బ్యాచిలర్ట్స్ డిగ్రీ పూర్తి చేస్తుంది. ప్రజెంట్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట కోర్సు చేస్తున్నారు. డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టపడే సినీ శెట్టి.. చిన్నతనం నుంచి భరత నాట్యం నేర్చుకున్నారు.

ఇప్పుడు జరిగిన పోటీల్లో మలైకా అరోరా, నేహా ధూపియా, డినో మోరియా, రాహుల్ ఖన్నా, రోహిత్ గాంధీ, షమక్ డామర్ జడ్జెస్‌గా ఉన్నారు. క్రికెటర్ మిథాలీ రాజ్ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉన్నారు. పోటీల్లో వరుసగా సినీ శెట్టి, రూబల్ షెకావత్ రన్నరప్‌గా కాగా.. థర్డ్ ప్లేస్‌లో ఉత్తరప్రదేశ్‌కి చెందిన షినతా చౌహాన్, తెలంగాణ అమ్మాయి ప్రజ్ఞా అయ్యాగారిని నాలుగు స్థానంతో సరిపెట్టుకుంది.

ఇప్పటివరకూ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న లారా దత్తా, సారా జేన్ డయాస్, నఫీసా జోసెఫ్, సంధ్యా ఛిబ్, రేఖ, హండె వీరంతా కూడా కర్ణాటకకి చెందిన వారే కాగా.. సినీ శెట్టి కూడా కర్ణాటక నుంచే రావడం విశేషం.

సినీ శెట్టి వివరాలు..

21 ఏళ్ళ సినీ శెట్టి ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. బరువు 54 కిలోలు. ఎంతో చక్కని నవ్వుతో.. అందర్నీ ఆకర్షించింది ఈ భామ. ముందు నుంచే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామ చాలా ఫేమస్. బేసిగ్గా ఆమె భరతనాట్యం డ్యాన్సర్ తన భరత నాట్యం డ్యాన్స్ వీడియోస్‌కి మిలియన్ వ్యూస్ ఉన్నాయి.

ట్రావెల్ అంటే మహా ఇష్టం..

సినీ శెట్టికి ముందు నుంచి ట్రావెల్ అంటే చాలా ఇష్టం. తనకి ప్రియాంక చోప్రా అంటే ఇష్టం. ప్రియాంక ఇన్సిపిరేషన్‌తోనే మోడలింగ్ కెరీర్‌లోకి అడుగుపెట్టింది సినీ శెట్టి.

ఫ్యామిలీ..

హిందూ ఫ్యామిలీకి చెందిన సినీ శెట్టి తల్లీ పేరు హేమ వెట్టి. తనకి ఓ షికిన్ శెట్టి అనే బ్రదర్ ఉన్నాడు. ఇక ఈ అమ్మడు కాంపిటీషన్‌లో విన్ అవ్వగానే తన సోషల్ మీడియా ఫాలోవర్స్ వేలల్లో పెరిగిపోవడమే కాకుండా. చాలా మంది తన గురించి విషయాలు తెలుసుకునేందుకు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారట.. ముందు నుంచి కష్టపడే తత్వం ఉన్న సినీ శెట్టి తన అంద చందాలు, టాలెంట్‌తో ఈ స్థానానికి చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.