చరణ్ 15ఏళ్ల ప్రస్థానంపై మెగాస్టార్ నుంచి ఓ మెమొరబుల్ పోస్ట్.!
ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఏ లెవెల్ క్రేజ్ వచ్చిందో చూస్తున్నాము. కేవలం పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా గ్లోబల్ గా కూడా సెన్సేషనల్ రీచ్ ని తాను సొంతం చేసుకున్నాడు. నేటితో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు సినిమా దగ్గర హీరోగా అరంగేట్రం చేసి 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. దీనితో ఈరోజు మెగా పవర్ స్టార్ కెరీర్ లోనే కాకుండా అభిమానుల్లో కూడా ఓ ప్రత్యేకమైన రోజుగా మారింది.
దీనితో ఈ రోజుకి గాను మెగా ఫ్యాన్స్ సహా రామ్ చరణ్ అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటుండగా తన ప్రైడ్ ఫాథర్ “ది గాడ్ ఫాథర్” మెగాస్టార్ చిరంజీవి ఒక మెమొరబుల్ పోస్ట్ ద్వారా రామ్ చరణ్ పదిహేనేళ్ల సినీ ప్రస్థానంపై మాట్లాడుతూ ఒక నటుడుగా చరణ్ “చిరుత” నుంచి “మగధీర”, “రంగస్థలం” అలాగే రీసెంట్ గా “RRR” ఇప్పుడు దర్శకుడు శంకర్ తో తన 15వ సినిమా చేసే స్థాయికి తనని తాను మార్చుకుంటూ వచ్చాడు.
తన వర్క్, డెడికేషన్ అన్నీ చూసి ఎంతో గర్విస్తున్నానని అలాగే చరణ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలి, నువ్వు సాధిస్తావ్ అని మెగాస్టార్ ఒక ప్రైడ్ ఫాథర్ గా తన గర్వాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని ఫోటోస్ తో కలిపి పోస్ట్ చేశారు. దీనితో ఈ పోస్ట్ మెగా ఫ్యాన్స్ లో ఒక అపురూపమైన పోస్ట్ గా మారింది అని చెప్పాలి.
