“మెగా 154” నుంచి క్రేజీ ట్రీట్ రాబోతోందా..?

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం “గాడ్ ఫాథర్” తో మళ్ళీ తాను సాలిడ్ కం బ్యాక్ అయితే ఇచ్చారు. ఇక ఈ చిత్రం తర్వాత చిరు అయితే మరిన్ని చిత్రాలు లైన్ లో పెట్టగా వాటిలో రెండు చిత్రాలు ఆల్రెడీ షూటింగ్ కూడా దగ్గరకి వచ్చాయి. ఇక వీటిలో అయితే దర్శకుడు బాబీ(కె ఎస్ రవీంద్ర) తో మెగాస్టార్ తన కెరీర్ లో 154వ సినిమా చేస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పైగా ఇందులో మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తుండడంతో మరింత ఆసక్తికరంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఇప్పుడు క్రేజీ అప్డేట్ అయితే తెలుస్తుంది. మేకర్స్ ఈ సినిమా నుంచి అదిరే టీజర్ కి ముహూర్తం ఫిక్స్ చేశారట. ఈ టీజర్ లేదా గ్లింప్స్ ని ఈ దీపావళి కానుకగా అయితే వడలబోతున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఎస్ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.