“మెగా 154” పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ కోసం అందరికీ తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమాగా ఇది తెరకెక్కిస్తుండగా షూటింగ్ ని మేకర్స్ శరవేగంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు చిత్ర యూనిట్ నుంచి అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రం డబ్బింగ్ ని అయితే ఈరోజు నుంచి మొదలు పెట్టినట్టు తెలిపారు.

మరి దీనికి గాను పూజా కార్యక్రమం చేసి అధికారికంగా కొన్ని ఫోటోలు విడుదల చేశారు. ఇక ఈ చిత్రం నుంచి అయితే ఈ దీపావళి కానుకగా సాలిడ్ అప్డేట్స్ సిద్ధంగా ఉండగా మేకర్స్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.