'ధమాకా'ను కూడా ముగించేసిన మాస్ రాజా..

మాస్ మహారాజా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తాడు.ఏడాదికి మూడు నాలుగు సినిమాలను పక్కాగా విడుదల చేస్తాడు.
ఈయన గ్యాప్ లేకుండా సినిమాలు అనౌన్స్ చేసి అంతే వేగంగా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.మరి ఇప్పుడు మరొక సినిమా షూటింగ్ కూడా ముగిసినట్టు తెలుస్తుంది.

ఇటీవలే రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ఖిలాడీ సినిమా, శరత్ మండవ దర్శకత్వంలో చేసిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు రెండు కూడా ప్లాప్ అయ్యాయి.క్రాక్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కినా రవితేజ మళ్ళీ రెండు ప్లాపులను ఎదుర్కున్నాడు.

అయినా కూడా ఈయన స్పీడ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు.
వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వాటిని నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తున్నాడు.

ప్రెజెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

అయితే రవితేజ చేసిన వరుస సినిమాలు పరాజయం కావడంతో ఈ సినిమాలో కీలక మార్పులు చేర్పులు చేసి మరింత ఫోకస్ పెట్టి తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఇక రేపు ఈ సినిమా నుండి మాస్ రాజా సాంగ్ రిలీజ్ చేయనున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి మరొక వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమా ఈ రోజుతో షూటింగ్ పూర్తి అయ్యింది అని దీపావళి నాటికీ థియేటర్స్ లో తీసుకు వస్తాం అంటూ యూనిట్ చెబుతుంది.

ఇక ఈ సినిమాలో రవితేజ కు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా.వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మరి ఈ సినిమా అయినా రవితేజ కెరీర్ లో హిట్ అవుతుందో లేదో చూడాలి.