త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు?
మాటల మాంత్రికుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 15 న ప్రారంభం కానుంది. అయితే, ఈ సినిమాలో మహేష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కనిపించనున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్. అందుకు సంబంధించిన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారని సమాచారం.
మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
