తాతామనవళ్ల కథతో రాబోతున్న ప్రభాస్.. కెరీర్ లోనే కొత్త జానర్!

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ చిత్రం తాతామనవళ్ల కథతో రూపొందుతోందని తెలుస్తోంది. పాతబడ్డ థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ కామెడీ జానర్‌లో ఈ సినిమా సాగుతుందని, అందుకే రెండు షెడ్యూల్స్‌లోనే ఈ చిత్రాన్ని పూర్తిచేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ కి పూర్తిగా కొత్త జోనర్ అవుతుంది.

ఇప్పటికే ఈ షెడ్యూల్స్ కోసం హైదరాబద్ లోని ఓ స్టూడియోలో భారీ సెట్‌ను కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ప్రభాస్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. అలాగే ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది.

మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. అలాగే ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ప్రస్తుతానికి అయితే.. ఈ విషయాల పై ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ రావాల్సి ఉంది. కాగా ప్రభాస్ తో మారుతి సినిమా చేస్తే.. ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే.