
పవన్ “ఓజి” పై లేటెస్ట్ అప్డేట్.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే పవన్ కెరీర్ లోనే మాసివ్ బడ్జెట్ అండ్ క్రేజీ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుండగా ప్రస్తుతానికి అయితే పవన్ వెర్షన్ కేజీయఫ్ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.
ఇక వాటికీ తగ్గట్టుగానే సుజీత్ కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లానింగ్ చేస్తుండగా లేటెస్ట్ గా అయితే సినిమా యూనిట్ బ్యాంగ్ కాక్ థాయిలాండ్ లాంటి ప్రాంతాల్లో లొకేషన్స్ వేటకు వెళ్లనున్నట్టుగా రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ థాయిలాండ్ లో ఉన్నట్టుగా కన్ఫామ్ అయ్యింది. సినిమా సినిమాటోగ్రాఫర్ ఆస్కార్ రవిచంద్రన్ ఆల్రెడీ పలు ఫోటోలు థాయిలాండ్ నుంచి ప్లాన్ చేస్తున్న లొకేషన్స్ ని చూపించగా లేటెస్ట్ గా సుజీత్ పై కూడా ఓ పిక్ వైరల్ అవుతుంది. మొత్తానికి అయితే ఇక్కడ కూడా మంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ ని మేకర్స్ సెటప్ చేస్తున్నారు అనిపిస్తుంది.