
“గాడ్ ఫాథర్” ప్రీ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో షూటింగ్ పూర్తి చేసుకొని ఈ దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న అవైటెడ్ సినిమా “గాడ్ ఫాథర్”. దర్శకుడు జయం మోహన్ రాజా తెరకెక్కించిన ఈ భారీ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు గ్రాండ్ గా జరుగుతుండగా దీనిపై అయితే లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది.
ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ అండ్ కొత్త ఎలిమెంట్స్ తో నింపుతుండగా సినిమా గెస్ట్ కి సంబంధించి టాక్ అయితే ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రానికి గెస్ట్ గా ఎవరు లేరట. కేవలం చిత్ర యూనిట్ మాత్రమే ఉంటుంది అని అలాగే కొందరు ఇతర దర్శకులు నిర్మాతలు కనిపించొచ్చని తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఏ ఇతర స్టార్ హీరో కూడా కనిపించకపోవచ్చనే టాక్. మరి దీనిపై క్లుప్తమైన క్లారిటీ రావాల్సి ఉంది.