‘కల్కి’లో ఆ సీక్వెన్స్ హైలైట్ అట

నేషనల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 AD’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లోని వీఎఫ్ఎక్స్ విజువల్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ అట. ముఖ్యంగా హిమాలయాల నేపథ్యంలో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ లోని విజువల్స్ కూడా అద్భుతంగా అనిపిస్తాయట.


ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అన్నట్టు మే 9న క‌ల్కి సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి.

Tags: