పట్టు వస్త్రాల్లో మెరిసిపోతున్న బేబమ్మ ..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ భామ నటించిన ది వారియర్, మాచర్ల నియోజక వర్గం ఇటీవలే విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. ఇక తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీతో వచ్చింది.

కృతిశెట్టి, ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ కృతిశెట్టి మొదటి సినిమా ఉప్పెన ఘన విజయం అందుకుంది. ఈ సినిమాతో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 

ఇక ఆ సినిమా తర్వాత అందాల భామ కృతిశెట్టి, నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ నటించి మరో విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత నాగచైతన్య సరసన బంగార్రాజులో నటించి మరో హిట్‌ను అందుకుంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నా... తాజాగా రామ్ పోతినేనితో చేసిన ది వారియర్, నితిన్‌ హీరోగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. 

ఇక తాాజగా ఈ భామ నటించిన లేటెస్ట్ సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సుధీర్ బాబు హీరోగా నటించారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా విడుదలైన రెండు రోజులకే చేతులెత్తేసింది. ఈ సినిమాపై బోలేడన్ని ఆశలు పెట్టుకున్నా కృతి బాగా అప్ సెట్ అయ్యిందట. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ మూవీకి తొలిరోజే నెగెటివ్‌ టాక్‌ రావడంతో.. కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయి. దీంతో కృతి ఖాతాలో మరో ఫ్లాప్‌ వచ్చిపడింది.

కెరీర్‌ బిగినింగ్‌లో హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసిన కృతిశెట్టికి ఇలా వరుసగా హ్యాట్రిక్‌ ఫ్లాపులు రావడంతో తెగ ఆందోళన చెందుతోందట. వరుసగా ప్లాపులు రావడంతో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇంకో సినిమా కనుక ప్లాప్ అయితే ఆమె కెరీర్ డేంజర్‌లో పడే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ప్రస్తుతం కృతి చేతిలో నాగచైతన్య, సూర్య చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాల ఫలితంపైనే కెరీర్‌ ఆధారపడింది.  ఇక అది అలా ఉంటే ఈ భామ ఈరోజు తన 19వ పుట్టిన రోజును జరుపుకుంటోంది.